నటి పూర్ణను వేధించిన ముఠా అరెస్ట్.. గ్యాంగ్‌తో ఓ నటుడికి సంబంధాలు

Share Icons:
అవును, సీమ టపాకాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. ఆమె అసలు పేరు . స్వస్థలం కేరళ. లాక్ డౌన్‌తో గత కొన్ని రోజులుగా పూర్ణ తన తల్లిదండ్రులతో కలిసి కేరళలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను సోషల్ మీడియా వేదికగా ఓ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది. దీంతో పూర్ణ పోలీసుల్ని ఆశ్రయించింది. ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌ చేయడంతో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా పోలీసులకు పూర్ణ ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది.

దీతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణను వేధింపులకు గురి చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్‌ కమీషనర్‌ విజయ్‌ సఖారే ఈ వివరాలను వెల్లడించారు. అంతేకాదు పూర్ణను వేధించిన ముఠా మరో 8 మంది మోడల్స్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిందని పోలీసులు అధికారులు వెల్లడించారు.

మొదటగా గ్యాంగ్ సభ్యులు వివాహ ప్రతిపాదన ద్వారా పూర్ణ కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే ఆమె నుంచి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు.

ఇప్పటికే ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ సమయంలో ధర్మజన్‌, స్టైలిస్ట్‌లను ముఠా సభ్యులు సంప్రదించినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.