నగ్నంగా నటించినా మా వారు ఏం అనరు: శర్వానంద్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Share Icons:
ఎవరీ భామ.. మరీ ఇంత బోల్డ్‌గా మాట్లాడుతుంది అంటే.. తెలుగులో అయితే ఆమెను గుర్తు చేసుకోవడానికి ఓ పదేళ్లు వెనక్కి వెళ్లాలి. 2009లో శర్వానంద్ హీరోగా ‘రాజు మహరాజు’ అనే సినిమా విడుదలైంది. మోహన్ బాబు, రమ్యక్రిష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని హీరోయిన్నే ఈ బోల్డ్ బ్యూటీ . తొలి చిత్రం తోనే అందాలను ఆరబోసి.. శర్వానంద్‌తో రొమాన్స్ కానిచ్చిన ఈ భామ మళ్లీ తెలుగులో కనిపించలేదు.

అయితే తన అందాల ప్రదర్శనకు బాగా గిట్టుబాటు ఉన్న బాలీవుడ్‌కి చెక్కేసి.. హమ్ తుమ్ శబానా అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమా తరువాత ‘హేట్ స్టోరీ 2’ అంగాగ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి ఆఫర్లను అందిపుచ్చుకుంది. బోల్డ్ పాత్రలతో గ్లామరసం పండించిన ఈ భామ అక్షయ్ తక్కర్ అనే బిజినెస్‌మేన్ ప్రేమలో పడింది. 2015లో అతన్ని పెళ్లాడిన ఈ భామ.. పెళ్లి తరువాత కూడా బోల్డ్ పాత్రల్లో మెరిసింది.

పెళ్లికి ముందు ఓకే.. మరి పెళ్లైన తరువాత ఇలాంటి పాత్రలు చేస్తుంటే మీ భర్త ఏం అనడా అంటే.. అబ్బే.. మా వారికి అస్సలు అలాంటి ఫీలింగే ఉండదు.. అంతెందుకు నగ్నంగా నటించినా మా వారికి నథింగ్.. ఆయన నన్ను అంతలా అర్థం చేసుకున్నారు. ప్రొఫెషన్ గురించి ఆయనకు బాగా తెలుసు.. ఏది చేసిన ప్రొఫెషన్‌లో భాగమే కదా.. అందులో పర్ఫెక్షన్ ఉండాలి కదా అని మాత్రమే ఇద్దరం ఆలోచిస్తాం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ.