ధోనీకి కాంట్రాక్ట్ ఎందుకివ్వాలి..?: బీసీసీఐకి సెహ్వాగ్ సపోర్ట్

Share Icons:
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం సమర్థనీయమేనని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున ఆడుతున్న 27 మంది క్రికెటర్లకి సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌ని ఇటీవల ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోనీకి చోటివ్వలేదు. దీంతో టీమిండియా అభిమానులు బీసీసీఐపై విరుచుకుపడ్డారు. కెప్టెన్‌గా భారత్‌కి టీ20, వన్డే ప్రపంచకప్‌లు అందించిన ధోనీని అవమానించారంటూ మండిపడ్డారు.

Read More:

ధోనీకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి గత కారణాల్ని విశ్లేషించిన బీసీసీఐ అధికారి మాటల్ని వీరేంద్ర సెహ్వాగ్ సమర్థించాడు అతను ఏం చెప్పాడంటే ‘హర్భజన్ సింగ్ 2015-16 నుంచి భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడటం లేదు. అలా అని అతను రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకూ భజ్జీ రిటైర్మెంట్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ.. ధోనీ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే.. అలా అడుగుతూ వార్తల్లో నిలవడం వారికిష్టం. ఇక రిటైర్మెంట్ అంటారా..? అది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. టీమ్‌లోకి ఆటగాడి ఎంపిక, వేటు పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం (సాధారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్‌ని సెలక్టర్లతో చర్చించిన తర్వాత బీసీసీఐ ప్రకటిస్తుంది). గత ఏడాది జులై నుంచి వన్డే మ్యాచ్‌లు ఆడని ధోనీకి బీసీసీఐ ఏ ప్రాతిపదికన సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి..?’ అని ప్రశ్నించాడు.

Read More:

2019, జులైలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. వన్డేలకి ధోనీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.