ధైర్యం చేసిన అఖిల్.. ‘బ్యాచ్‌లర్’కు సపోర్ట్‌గా పూజా హెగ్డే

Share Icons:
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. ఇటీవలే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్‌ను ప్రారంభించారు. హీరోయిన్ నభా నటేష్‌తో స్టెప్పులేశారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు యంగ్ హీరో అక్కినేని కూడా ధైర్యంగా షూటింగ్ షురూ చేశారు.

అఖిల్, జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో మంగళవారం పాల్గొన్నారు పూజా హెగ్డే. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘మళ్లీ సెట్లోకొచ్చాను’ అని తన టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.

నిజానికి ఏడాది వయసు నుంచే (‘సిసింద్రీ’ సినిమా నుంచి) సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తోన్న అఖిల్.. హీరోగా ఇంకా సరైన మార్కెట్‌ను సంపాదించలేకపోయారు. ఆయన హీరోగా లాంచ్ అయ్యి ఐదేళ్లు దాటింది. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం ఈ అక్కినేని హీరో బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Also Read: