దెబ్బకు వణికిపోయిన బండ్ల గణేష్! వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేశాడు.. హాట్ ఇష్యూ

Share Icons:
కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించారు . ఆ వెంటనే మరో అడుగు ముందుకేసి పాలిటిక్స్ లోకి వెళ్లిన ఆయన.. పొలిటీషియన్‌గా మాత్రం తుస్సుమన్నాడు. ఇక బిజినెస్‌మెన్‌గా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మనోడు చెప్పే ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కావడంతో ఏదో ఒక రూపంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. గత ఎన్నికల సమయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనదైన స్టైల్ కామెంట్స్, ప్రభుత్వంపై విమర్శలతో నానా రచ్చ చేశారాయన. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, 7’O క్లాక్ బ్లేడ్ ఇష్యూ అయితే ఎప్పటికీ జనం మరచిపోలేరు. ఇంత చేసినా ఆశించిన ఫలితం రాక, ఘోరంగా విఫలం కావడంతో యూ టర్న్ తీసుకొని తిరిగి సినిమాల వైపు చూస్తున్నారు బండ్ల గణేష్. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ బండ్ల గణేష్‌ని ట్యాగ్ చేస్తూ ఓ ఆసక్తికర ప్రశ్న సంధించడంతో వెంటనే తనదైన రియాక్షన్ ఇచ్చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

Also Read:
అన్నా.. బీజేపీలో చేరుతున్నావా? అని ఆ నెటిజన్ అడగడంతో బండ్ల గణేష్ ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు. వద్దు బాబోయ్ అంటూ.. సింపుల్‌గా ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అని పేర్కొంటూ చేతులెత్తి దండం పెట్టడం హాట్ టాపిక్ అయింది. దీంతో రాజకీయాల మాటెత్తితేనే మనోడు వణికిపోతున్నాడుగా అంటూ చర్చించుకుంటున్నారు జనం. పాపం! చేతులెత్తేసిన బండ్ల గణేష్‌ని పదే పదే ఆ పీడకల గుర్తు చేస్తూ బాధపెడుతున్నారని చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత ఎన్నో సందర్భాల్లో తాను రాజకీయాలను దూరమవుతానని బండ్ల గణేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత.. ఇక కెమెరా ముందు కూడా కనిపించనని నిర్మొహమాటంగా చెప్పేశారు. తన దృష్టి మొత్తం సినిమా నిర్మాణం పైనే పెడతానని, తన దేవుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే మరో భారీ సినిమా తీస్తానని అంటున్నారు. సో.. చూడాలి మరి బండ్ల గణేష్ ఫ్యూచర్ స్టెప్స్ ఎలా పడతాయనేది?.