దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన బాగ్గేజ్ ఆపరేషన్

Share Icons:

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు తీసుకువచ్చే బాగ్స్ వాళ్ళ జరిగే పైన చెప్పిన ప్రమాదాలాంటివి  అరికట్టడానికి దుబాయ్ విమానాశ్రయాల్లో నూతన బాగ్గేజ్ ఆపరేషన్ అమలుచేస్తోంది.

ఈ నేపధ్యంలో ఎయిర్ లైన్స్ వారికి బాగ్గేజ్ ఆపరేషన్ లో అనుమతి ఇచ్చే బాగ్స్ గురించి, నిషేదించిన బాగ్స్ గురించి ఒక అవగాహన కోసం వెబ్సైటు మొబైల్ ఆప్స్లో DXB ఆపరేటింగ్ గురించి అప్డేట్ చేయమని సూచించారు.

సాంకేతికంగా అభివృద్ధి చెంది అనేక అధునాతన సౌకర్యాలతో ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ సంచులు, గుండ్రంగా ఉండే సంచులు, సక్రమ ఆకారంలో లేని సంచులు (బాగ్స్) వాళ్ళ టెర్మినల్ ఆపరేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది అని విస్ ప్రెసిడెంట్ అలీ అన్జిజెహ్ తెలిపారు. వీటి వాళ్ళ చెకింగ్ సమస్యలు, అలాగే డెలివరీ ఆలస్యం అయ్యే సూచనులు ఎక్కువ అని తెలిపారు. ఇక ఎలాంటి బాగ్స్ ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించరంటే

  1. రౌండ్ బాగ్స్
  2. సమతలంగా లేని, అలాగే ఉపరితలం (పైన ) సరి అయిన ఆకారం లేని
  3. సక్రమ ఆకారం లేని బాగ్స్
  4. భారీ బాగ్స్
  5. ప్రయాణానికి సహకరించని బాగ్స్ ని ఫీజ్ కోసం రీపాక్ చేస్తారు ఆ బాగ్స్ .. ఇవేవి అనుమతించబడవు.

DXB సిస్టం లో ఒక్కో బాగ్ చెక్ చేయడానికి 29 నిముషాలు పడుతుంది ఈ సమయాన్ని తగ్గించడానికి సరి అయిన బాగ్గింగ్ సిస్టం అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.

-రమణి రాచపూడి

Leave a Reply