దివ్యాంగ బాలుడికి క్రికెట్ కిట్ పంపిన సచిన్

Share Icons:
కాళ్లు చచ్చుబడిపోయినా.. ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని మరో చేయి సాయంతో వికెట్ల మధ్య పరుగు తీస్తూ క్రికెట్‌పై ప్రేమని చూపుతున్న దివ్యాంగ బాలుడు మద్దారామ్‌కి ఊహించని బహుమతి లభించింది. దిగ్గజ క్రికెట్ అతడికి స్వయంగా క్రికెట్‌ క్రికెట్‌ని పంపించాడు.

బస్తర్‌కి చెందిన రామ్‌ ఇటీవల తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోని జనవరి 1న షేర్ చేసిన సచిన్ టెండూల్కర్.. రామ్‌ని ప్రశంసించాడు. కొత్త ఏడాదిని స్ఫూర్తిమంతమైన వీడియోతో ప్రారంభించండి అని ఆ ట్వీట్‌లో సచిన్ రాసుకొచ్చాడు.

రాయ్‌పూర్‌లో జరుగుతున్న టోర్నీలో ప్రస్తుతం వీల్‌ఛైర్ ఫైనల్ మ్యాచ్‌లో రామ్ ఆడుతున్నాడు. అక్కడికి వెళ్లిన సచిన్ టెండూల్కర్ మేనేజర్.. కిట్‌తో పాటు ఓ లేఖని కూడా రామ్‌కి అందజేశాడు. అందులో రామ్‌ క్రికెట్ ఆడుతున్న విధానంపై ప్రశంసలు కురిపించిన సచిన్.. స్నేహితులతో కలిసి ఇలానే క్రికెట్ ఆడాలని అభిలాషించాడు.