దాన్ని చంపి కాల్చేద్దామంటూ మాజీ భార్యపై హీరో కుట్ర.. మెసేజ్‌లు చదివి షాకైన జడ్జ్

Share Icons:
ప్రముఖ హాలీవుడ్ నటుడు .. తన మాజీ భార్యను చంపేందుకు వేసిన ప్లా్న్ చూసి షాకయ్యాడు న్యాయమూర్తి. జానీ, ఆంబర్‌ల మధ్య జరుగుతున్న వివాదం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంబర్‌ను చంపడానికి స్నేహితుడితో కలిసి జానీ వేసిన ప్లాన్, దానికి సంబంధించిన మెసేజ్‌లు లీకయ్యాయి. దాంతో ఈరోజు ట్రయల్ ఉండడంతో జానీ కోర్టుకు వెళ్లారు. కోర్టులో జడ్జ్ ఈ మెసేజ్‌లన్నీ చదివి వినిపించారు. అలా ఇప్పటివరకు 70వేల మెసేజ్‌లు చదివారు.

వాటిలో జానీ ఏమని పేర్కొన్నారంటే.. ‘ఆంబర్‌ను తగలబెట్టేద్దాం. ముందు నీళ్లలో ముంచి చంపుదాం. ఆ తర్వాత శవాన్ని కాల్చేద్దాం’ అని జానీ తన స్నేహితుడైన నటుడు పాల్ బెట్టనీకి 2013లో మెసేజ్‌ పంపారు. ఆ తర్వాత 2014లో ‘నేను తాగడం పూర్తిగా మానేస్తా డార్లింగ్. నేను ఆంబర్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌కి వెళ్లాల్సి ఉంది. అందుకే రాత్రి తాగాను. తను అసహ్యకరమైన భార్య. నాకు తిండి లేదు. పౌడర్లు, విస్కీ మాత్రమే ఉన్నాయి’ అని మరో మెసేజ్ పంపారు. ఈ మెసేజ్‌లన్నీ చదివి జడ్జ్‌ కూడా షాకయ్యారు. అయితే ఈ మెసేజ్‌లన్నీ తానే చేసినట్లు జానీ ఒప్పుకున్నారు. కానీ ఎక్కడా ఆంబర్‌పై చేయిచేసుకున్నట్లు ఏ ఆధారాలు లేవని, ఇవన్నీ ఆంబర్ తనను టార్చర్ పెట్టడం వల్ల జానీ పంపిన మెసేజ్‌లని జానీ తరఫు న్యాయవాది తెలిపారు.

READ ALSO:

గతంలో ఆంబర్ జానీపై చేసిన దాడులకు సంబంధించిన ఆడియో ఒకటి లీకైంది. తన భర్తను టార్చర్ పెట్టానని ఆ ఆడియోలో ఒప్పేసుకున్నారు. కుండలు, ఇంట్లోని వంట సామాన్లతో తన భర్తపై దాడి చేశానని వెల్లడించారు. దాంతో జానీ డెప్ 50 మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలంటూ ఆంబర్‌పై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఒకప్పుడు ఆంబర్ డెప్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంతో ఆయన నటించాల్సిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనపై ఆంబర్ ఆరోపణలే చేయడంతో డిస్నీ సంస్థ ఆయనకు ఫేమస్ జాక్ స్పారో పాత్రను ఇవ్వలేదు.

READ ALSO: