తొలి వన్డేలో శిఖర్ ధావన్‌కి 3 లైఫ్స్.. 74 ఔట్

Share Icons:
ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్ ధావన్‌కి మూడు జీవనదానాలు లభించాయి. మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (10: 15 బంతుల్లో 2×4)తో సమన్వయలోపం కారణంగా రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకున్న (74: 91 బంతుల్లో 9×4, 1×6).. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌(47: 61 బంతుల్లో 4×4)తోనూ అదే ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. చివరిగా ఔటయ్యే ముందు కూడా ఓసారి అతను రనౌటవ్వబోయాడు. అయితే.. ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ తప్పిదంతో అతనికి ఛాన్స్ లభించింది. కానీ.. జట్టు స్కోరు 140 వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో గాల్లోకి బంతిని లేపేసిన ధావన్ ఫీల్డర్‌ అగర్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Read More:

గత ఏడాది జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ఫామ్‌ కోల్పోయిన శిఖర్ ధావన్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. కానీ.. ఈరోజు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో మొదట ఈ ఓపెనర్ కాస్త తడబడినట్లు కనిపించింది. ముఖ్యంగా.. షాట్ ఆడిన తర్వాత పరుగుకి రోహిత్ శర్మని పిలవడం.. మళ్లీ వెనక్కి వెళ్లడం.. ఆ తర్వాత రాహుల్ విషయంలోనూ అదే జరిగింది. ఆఖరిగా విరాట్ కోహ్లీ అయితే.. షాట్ ఆడి క్రీజులో ఉండగానే శిఖర్ ధావన్ దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు.

Read More:

మొత్తంగా మూడు జీవనదానాలు లభించినప్పటికీ శిఖర్ ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా బంతిని ధావన్ హిట్ చేయడానికి ప్రయత్నించగా.. అది బ్యాట్ ఎడ్జ్ తాకి కవర్స్‌లో గాల్లోకి లేచిపోయింది. దీంతో.. నిరాశగా ధావన్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.