తొందరపాటులో పాక్ నవ్వులపాలు.. ఈ పాకియాతాన్ ఏంటి..?

Share Icons:
క్రికెటర్లు ఇంగ్లీష్‌లో చేసే ట్వీట్లు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి. వచ్చిరాని ఇంగ్లీష్‌లో గ్రామర్ ఫాలో అవకుండా ఆ దేశ క్రికెటర్లు ట్వీట్లు చేసి ఎన్నోసార్లు నవ్వులపాలయ్యారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చిన్న తప్పిదం కారణంగా నెటిజన్ల చేతికి చిక్కింది.

ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు గత ఆదివారం పాకిస్థాన్ జట్టు అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ క్రమంలో క్రికెటర్లు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోల్ని అభిమానులతో పంచుకున్న పీసీబీ.. తొందరపాటులో పాకిస్థాన్ పేరుని తప్పుగా రాసింది. ‘‘పాకియాతాన్ టీమ్ ఇంగ్లాండ్‌కి బయల్దేరింది.. ఆల్‌ ద బెస్ట్ బాయ్స్!’ అని పీసీబీ ట్వీట్ చేసింది. దాంతో.. నెటిజన్లు ఈ ‘పాకియాతాన్ టీమ్’ ఏంటి..? అంటూ జోక్‌లు పేల్చారు.

పాకిస్థాన్ పేరుని తప్పుగా రాయడాన్ని ఆలస్యంగా గమనించిన పీసీబీ.. వెంటనే దిద్దుబాటు చర్యలకి దిగి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసింది. ఆ తర్వాత ‘పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్‌కి బయల్దేరింది’ అని ట్వీట్ చేసి ఆల్‌ ద బెస్ట్‌ పదాల్ని ప్రస్తావించలేదు. దాంతో.. పాక్ క్రికెటర్లే కాదు.. బోర్డుకి కూడా తికమక జబ్బు ఉందంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.