తమన్నా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే..!

Share Icons:
మిల్కీ బ్యూటీ దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు మంచి మార్కెట్ వాల్యూ ఉంది. అగ్ర కథానాయికగానే కాదు ఐటెం డ్యాన్సర్‌గానూ పాపులర్ అయింది. అంతటి పాపులారిటీ దక్కించుకున్న తమన్నాకు రెమ్యునరేషన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతినిండా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇష్టమైన వస్తువులు కూడా కొంటూ ఉంటాం. తమన్నా కూడా తనకు నచ్చిన వస్తువులను చకచకా కొనగలిగే స్తోమత ఉంది. తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఇవేనంటూ తమన్నా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. అవేంటో చూద్దాం.

అత్యంత ఖరీదైన బ్యాగ్?
నా దగ్గర షనెల్ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన బ్యాగ్ ఉంది. నా వద్ద ఉన్న అన్ని బ్యాగుల్లో అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదే.

మీరు వెళ్లిన అత్యంత ఖరీదైన ట్రిప్?
అమెరికా. నేను అమెరికా వెళ్లడం వల్ల ఖర్చు అంతగా అవ్వలేదు కానీ అక్కడ చేసిన షాపింగ్ బిల్లు మాత్రం తడిచి మోపెడైంది.

అత్యంత ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్?
నా దగ్గర ఓ హెయిర్ జెల్ ఉంది. నాకు బ్రాండ్ పేరు గుర్తుకు రావడంలేదు కానీ అది చాలా ఖరీదైనది. చిన్న బాటిల్‌లా ఉంటుంది కానీ దాదాపు 50 వేల రూపాయలు పెట్టి కొన్నా.

మీరు అందుకున్న ఖరీదైన కానుక?
నాకు నా ఫ్రెండ్ ఒకరు హర్మేస్ బ్రాండ్‌కు చెందిన ఓ బ్యాగ్ కానుకగా ఇచ్చారు. ఇప్పటివరకు నేను అందుకున్న గిఫ్ట్స్‌లో అదే చాలా ఖరీదైనది.

READ ALSO:

జీవితంలో మీరు తీసుకున్న ఖరీదైన నిర్ణయం?
ఇటీవల ముంబైలో ఓ అపార్ట్‌మెంట్ కొన్నాను. అదే నేను జీవితంలో తీసుకున్న అత్యంత ఖరీదైన నిర్ణయం.

మీ బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండే ఖరీదైన వస్తువు?
నేను కొన్న అపార్ట్‌మెంట్ తాళాలు.

మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ఖరీదైన దుస్తులు ఏవి?
నేను కొన్న స్టెల్లా మెక్ కార్ట్నీ డ్రెస్ చాలా ఖరీదైనది. నేను కొంటున్నప్పుడు అది అంత ఖరీదైనదని నాకు తెలీలేదు. కానీ అది ఎప్పుడూ వేసుకోవడానికి ఇష్టపడతాను.

మీరు కొన్న అత్యంత ఖరీదైన మేకప్ ప్రొడక్ట్?
నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. షాపింగ్‌కి వెళ్లినప్పుడల్లా ఏదో ఒకటి కొంటూనే ఉంటాను. నేను కొన్న అత్యంత ఖరీదైన మేకప్ ప్రొడక్ట్ ప్యాట్ మెక్ గ్రాత్ బ్రాండ్‌కు చెందిన ఐ షాడో.

మీరు సినిమాల కోసం వేసుకున్న అత్యంత ఖరీదైన దుస్తులు?
నేను ‘సైరా’ సినిమాలో నటిస్తున్నప్పుడు అత్యంత ఖరీదైన దుస్తులు వేసుకున్నాను. వాటిలో కొన్ని సుష్మిత కొణిదెల డిజైన్ చేశారు. మరికొన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అంజూ మోది డిజైన్ చేశారు.

READ ALSO:

మీరు నటించిన భారీ బడ్జెట్ సినిమా?
‘బాహుబలి’, ‘సైరా’.

మీరు అందుకున్న తొలి చెక్కుతో కొన్న అత్యంత ఖరీదైన వస్తువు?
డైమండ్ రింగ్ కొనుక్కున్నాను. చాలా మంది నా రింగ్‌ని చూసి నిశ్చితార్థం అయిందనుకున్నారు.