తన సినిమాలో రష్మిక వద్దంటున్న స్టార్ హీరో?

Share Icons:
రష్మిక మందన … ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్. వరుస హిట్లతో స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరోయిన్. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. అయితే అంత క్రేజ్ ఉన్నా రష్మికను మాత్రం తన కొత్త సినిమాలో వద్దనేశాడు ఓ సూపర్ స్టార్ హీరో. తాజాగా దర్శకుడు పరుశరామ్‌ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం సినిమా డైరెక్టర్ కూడా పరుశరామ్‌నే. దీంతో అటు మహేష్ కూడా సరిలేరు సినిమాలో రష్మికతో జతకట్టాడు. దీంతో కొత్త సినిమాలో కూడా రష్మికనే తీసుకుంటూ బావుంటుందని పరుశరామ్ మహేష్‌తో అన్నట్లు సమాచారం.

అయితే దానికి మహెష్ నో చెప్పేశాడని అంటున్నారు. ఆమెతో సినిమా చేశాను కదా వేరే వాళ్ళను చూడు అని మహేష్ డైరెక్టర్‌తో అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంలో మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. పరశు రామ్ మూవీకి ఇంకా స్టోరీయే ఫైనల్ కాలేదని కొందరు చెబుతున్నారు. కథ లేనప్పుడు ఇంతలో హీరోయిన్ గోల ఎక్కడి నుంచి వచ్చిందని అంటున్నారు. దీంతో సినిమాకు సంబంధించి ముందు స్టోరీని పూర్తిగా రాసుకోమని, అందుకోసం కావాల్సినంత టైం తీసుకోమని కూడా మహేష్ పరుశరామ్‌తో అన్నట్లుగా టాక్ ఉంది. ఇపుడు ఎలాగూ కరోనా వైరస్ తో షూటింగులను బంద్ చేశారు. కాబట్టి తాపీగా స్క్రిప్ట్ మీద కూర్చోమన్నాడు.

అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబు హైట్ పక్కన రష్మిక పెద్దగా ఎట్రాక్ట్‌గా కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదని టాక్ వినిపించింది. దీంతో అందుకే మరోసారి మహేష్ రష్మిక మందనను వద్దంటున్నాడు అని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద పరుశరామ్ మహేష్ సినిమా సెట్స్‌పైకి వెళ్తే తప్పా మహేష్ హీరోయిన్ ఎవరో అన్న విషయం తెలియదు.