ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య: రూలర్ లో అదే హైలైట్ అంటా…

balakrishna new poster trending....
Share Icons:

హైదరాబాద్: లేటు వయసులో కూడా బాలయ్య స్టైలిష్ లుక్ తో అభిమానులని ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా సినిమా రంగంలో తనదైన ముద్రవేసిన బాలయ్య వయసు పెరిగేకొద్దీ వేగంగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య గతంలో ‘జై సింహా’ వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘రూలర్’ అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్ర బాలయ్య లుక్స్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయనే చెప్పాలి. అయితే సినిమా స్టోరీపై అనేక వార్తలు వస్తున్న పూర్తి క్లారీటీ మాత్రం లేదు. కాగా, ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్లకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా తాజాగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ట్విట్టర్ లో ట్రెండ్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. ఈ సినిమాలో ఒక సీన్ బాగా హైలైట్ కానుందని తెలిసింది. అది క్లైమాక్స్‌లో వచ్చే యాక్టన్ సీన్ అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దీని చిత్రీకరణ జరిగిందట. ఈ ఫైట్‌లో దాదాపు ఐదు వందల మంది ఆర్టిస్టులు ఉంటారట. ఈ సీన్‌లో బాలయ్య విశ్వరూపం చూస్తారని అంటున్నారు.  మరి చూడాలి రూలర్ కూడా జైసింహా స్థాయిలో హిట్ అవుతుందో లేదో..

 

Leave a Reply