ట్రంప్‌ను ట్రోల్ చేసిన IPL మాజీ స్టార్‌

Share Icons:
రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌త్‌కు సోమ‌వారం అమెరికా అధ్య‌క్షుడు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్‌లోని మొతెరా స్టేడియాన్ని ప్రారంభించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. అయితే ఆ ప్రసంగంలో భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీల పేరును త‌ప్పుగా ప‌ల‌కడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ట్రంప్‌ను నెటిజ‌న్లు ఏకిప‌డేస్తున్నారు. స‌చిన్ పేరును సొచిన్‌గా, కోహ్లీ పేరును కోలీగా ట్రంప్ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఒక నెటిజ‌న్ చేసిన ట్వీట్‌ను ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ రిట్వీట్ చేశాడు.

Read Also:

ఇంత‌కీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..? ట‌్రంప్ ఉచ్ఛార‌ణ‌ను బ‌ట్టి, ట్రంప్ క్రికెట్ ఫ్యాన్ కాద‌ని తెలిసిపోతుంద‌ని స‌ద‌రు నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. దీనిపై పీట‌ర్సన్ కూడా కాస్త ఘాటుగా స్పందించాడు. సచిన్‌లాంటి దిగ్గ‌జాల పేర్ల‌ను పలికేట‌ప్పుడు కాస్త రీస‌ర్చ్ చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ట్వీట్ చేశాడు. మ‌రోవైపు ఐసీసీ కూడా ట్రంప్ తీరును ఎద్దేవా చేసింది.

Read Also:

మ‌రోవైపు ట్రంప్ తాజాగా ప్రారంభించిన మొతెరా స్టేడియం అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతెరా స్టేడియం రికార్డుల‌కెక్కింది. దీని సీటింగ్ కెపాసిటీ లక్షా ప‌దివేలు కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం పేరిట ఉంది. దీనిలో ఒకేసారి ల‌క్ష మంది కూర్చుని మ్యాచ్ చూసేందుకు అవ‌కాశ‌ముంది.