టెస్టు జట్టులోకి భారత ఓపెనర్ రీఎంట్రీ!

Share Icons:
న్యూజిలాండ్ పర్యటనలో భారత టెస్టు జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మఖ్యంగా గతంలో టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన న్యూజిలాండ్ పర్యటనలో చోటు దక్కించుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 21 నుంచి కివీస్‌తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందు ఈనెల 24 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల్లో బరిలోకి దిగనుంది.

Read Also :
ఇటీవల భారత పరిమిత ఓవర్ల జట్టులో రాహుల్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన ఆ లోటు తెలియకుండా ముంబై, రాజ్‌కోట్ వన్డేల్లో అద్భుతంగా కీపింగ్ చేశాడు. ముఖ్యంగా రెండోవన్డేలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను మెరుపు వేగంలో స్టంప్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో ఆకట్టుకున్నాడు.

Read Also :
ఈక్రమంలో న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లే పరిమిత ఓవర్ల జట్టులో సభ్యుడైన రాహుల్ టెస్టు జట్టులోనూ స్థానం పొందే అవకాశముంది. జట్టు మేనేజ్మెంట్ ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం రాహుల్ సొంతం. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కోలుకోకపోతే అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశముంది. దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్న యాదవ్.. కివీస్ టూర్‌కు ఎంపికయ్యే చాన్సెస్ ఎక్కువనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2023 వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కేదార్ జాదవ్ లేడు కాబట్టి అతని స్థానంలో అజింక్య రహానే లేదా మరే ఇతర ఆటగాడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక టెస్టు జట్టులో కుల్దీప్ యాదవ్‌ను తప్పించి అతని స్థానంలో నవదీప్ సైనీని ఎంపిక చేసే చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నాయి.

Read Also :