టెస్టు క్రికెట్‌ పున‌రుద్ధ‌రణకు అంత‌ కాలంపాటు ఆగాల్సిందే: ఐసీసీ

Share Icons:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్న క్ర‌మంలో క్రికెట్ కార్య‌క‌లా‌పాల‌ను పున‌రుద్ధ‌రించేందుకు ఇటీవ‌లే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక టెస్టు క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు బౌల‌ర్లకు త‌గిన స‌మ‌యం ఇవ్వాల్సిన అవ‌స‌ర‌ముందని సూచించింది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 వారాల‌పాటు త‌గిన స‌న్నాహ‌కాలు చేసుకోవాల్సిన అవ‌స‌ర‌ముందని సూచించింది. అప్పుడే ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌కుండా ఉంటార‌ని సూచించింది.

Must Read:
ఈక్ర‌మంలో అన్నీ జ‌ట్లు ఎక్కువ సంఖ్య‌లో రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని ఐసీసీ తెలిపింది. ఇక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి నాలుగు వారాల ముందు నుంచి క‌ఠోర‌మైన సాధన చేయాల‌ని పేర్కొంది. అలాగే మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో అంపైర్లతో ఎలాంటి కాంటాక్టు ఉండ‌కూడద‌ని సూచించింది. అంత‌కుముందు ప్ర‌తి జ‌ట్టు త‌మ స్క్వాడ్‌లో చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని పేర్కొంది.

Must Read:
అలాగే బ‌యో సెక్యుర్ ఆఫీస‌ర్‌ను ప్ర‌తి జ‌ట్టు నియ‌మించుకోవాలని ఐసీసీ సూచించింది. ఆయా ప్ర‌భుత్వాలు కోవిడ్-19పై ఏర్పాటు చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించేలా స‌దుర అధికారి చూస్తార‌ని తెలిపింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త మార్చి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ కార్య‌క‌లాపాలు స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రికెట్ యాక్టివిటీస్‌ను పున‌:ప‌్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు.