టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో

Share Icons:
కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రకాలు పరీక్షలు రద్దు అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు. అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో టెన్త్ పరీక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు విష్ణు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు మాత్రం విష్ణు ఆలోచన సరికాదంటున్నారు. . ఎందుకంటే పరీక్షలనేవి పిల్లలను భయపెట్టి ఒత్తిడికి గురి చేయడానికి ఉద్దేశించినవి కాదంటున్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా సులభంగా గ్రహిస్తారని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .మరికొందరు 14, 15ఏళ్లలో వీరు ఒత్తిడిని తట్టుకోలేకపోతే.. ముందు ముందు భవిష్యత్తులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోగలరంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది.