టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ వాయిదాపై స్పందించిన బీసీసీఐ

Share Icons:
ప్ర‌తిష్టాత్మ‌క టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను వాయిదా వేయాల‌ని ఐసీసీని అడ‌గ‌లేద‌ని శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించే విండోలో ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌నే క్ర‌మంలో బీసీసీఐ ఈ ప్ర‌తిపాద‌న చేసింద‌ని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఈ వార్తల‌ను ఖండించారు. అలా త‌మ బోర్డు ఎందుకు చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు. త్వ‌ర‌లో ఐసీసీతో జ‌రిగే స‌మావేశంలో టోర్నీ గురించి త‌మ ఆలోచ‌న‌లు చెప్తామ‌ని పేర్కొన్నారు.

Must Read:
మ‌రోవైపు ఈ టోర్నీ గురించి నిర్ణ‌యం తీసుకోవాల్సింది ఐసీసీ, ఆస్ట్రేలియా ప్ర‌భుత్వమ‌ని ధుమాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌వేళ టోర్నీ విష‌య‌మై ఆసీస్ ప్ర‌భుత్వం సానుకూల‌ నిర్ణ‌యం తీసుకుంటే, టోర్నీని నిర్వ‌హించే శక్తియుక్తులు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై బీసీసీఐకి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

Must Read:
మ‌రోవైపు ఒక‌వేళ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించ‌డం సాధ్యంకాక‌పోతే ఆ స‌మ‌యంను తాము ఉప‌యోగించుకుంటామ‌ని ధుమాల్ తెలిపారు. అప్ప‌టి ప‌రిస్థితి, షెడ్యూల్‌ను బట్టి టోర్నీపై నిర్ణ‌యిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు క‌రోనా త‌ర్వాత తిరిగి గాడిన ప‌డేందుకు క్రికెటర్లకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. దాదాపు నెల‌రోజుల ట్రైనింగ్ అనంత‌రం భార‌త క్రికెట‌ర్లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధ‌మ‌వుతార‌ని తెలుస్తోంది.