టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఏదో ఒక‌టి త్వ‌ర‌గా తేల్చండి: ఆసీస్ లెజెండ్‌

Share Icons:
ప్రతిష్టాత్మ‌క టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఏదో ఒక‌టి త్వ‌రగా తేల్చాల‌ని ఆస్ట్రేలియా దిగ్గ‌జ ప్లేయర్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోప్ర‌పంచ‌క‌ప్‌లాంటి మెగా టోర్నీ అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌డానికి ఆస్కారం క‌న్పించ‌డం లేద‌ని వ్యాఖ్యానించాడు. ఈనెల 28న జ‌రిగే స‌మావేశంలో ఐసీసీ టోర్నీ భ‌విష్య‌త్తుపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించాడు. నిజానికి ఈ ఏడాది ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియాలో అక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సి ఉంది. అయితే క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ సందిగ్ధంలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఐసీసీ టోర్నీపై నిర్ణ‌యం తీసుకోవాలని సూచిస్తున్నాడు.

Must Read:
అక్టోబ‌ర్‌లో ఖాళీ స్టేడియాల్లో ప్ర‌పంచ‌క‌ప్‌ను నిర్వ‌హించ‌డం సరికాద‌ని టేల‌ర్ వ్యాఖ్యానించాడు. ఈ నేప‌థ్యంలో ఈ టోర్నీ విండోను భార‌త్ ఐపీఎల్ కోసం ఉప‌యోగించుకునే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేశాడు. అయితే ఐపీఎల్లో ఆడ‌టం కోసం త‌మ ఆట‌గాళ్ల‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Must Read:
మ‌రోవైపు బీసీసీఐని హ్యాపీగా ఉంచడం కోసం సీఏ ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముందని టేల‌ర్ అంచ‌నా వేశాడు. ఎందుకంటే వ‌చ్చే న‌వంబ‌ర్‌లో త‌మ దేశంలో భార‌త ప‌ర్య‌ట‌న ఉంద‌ని, ఈ టూర్ జ‌రిగితే త‌మ బోర్డుకు నిధుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తుంద‌ని తెలిపాడు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే సీఏ అప్పుల్లో కూరుకుపోయింది. భార‌త టూర్‌పైనే సీఏ ఆశ‌లు పెట్టుకుంది. సిరీస్ నిర్వ‌హ‌ణ కోసం ఇప్ప‌టికే 50 మిలియ‌న్ డాల‌ర్లను సీఎ అప్పు చేసింది. ఈ సిరీస్ జ‌రిగితే 300 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని సీఏ అంచనా వేస్తోంది.