టీమ్ నిర్ణయాన్ని పంత్ అంగీకరించాలి: రహానె

Share Icons:
భారత యువ వికెట్ కీపర్ ఇటీవల మైదానంలో కంటే రిజర్వ్ బెంచ్‌పైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. భారత సెలక్టర్లు రిషబ్ పంత్‌కి వరుసగా అవకాశాలిచ్చారు. దీంతో.. ఒకానొక దశలో మూడు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా కనిపించాడు. కానీ.. మూడు నెలల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మూడు ఫార్మాట్లకీ అతను ఎంపికవుతున్నా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

Read More:

‘రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ.. టీమ్ నిర్ణయాన్ని సదరు క్రికెటర్ అర్థం చేసుకోవాలి.. అంగీకరించాలి కూడా. తప్పదు.. మళ్లీ టీమ్‌లోకి రావాలంటే శ్రమించాలి.. నిరూపించుకోవాలి. ఇందులో సీనియర్, జూనియర్ అని భేదం ఏమీ ఉండదు’ అని రహానె సూచించాడు. వన్డే, టీ20లకి పూర్తిగా దూరమైపోయిన అజింక్య రహానె టెస్టుల్లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Read More:

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా రిషబ్ పంత్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోగా.. కేఎల్ రాహుల్‌కి కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆ మ్యాచ్‌లో కీపర్‌గా ధోనీ తరహాలో స్టంపౌట్ చేసిన రాహుల్.. ఆ తర్వాత కూడా కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా సత్తాచాటాడు. దీంతో.. రిషబ్ పంత్‌ని పూర్తిగా పక్కన పెట్టేసిన టీమిండియా మేనేజ్‌మెంట్ రాహుల్‌కి వరుస అవకాశాలిస్తోంది.