టాలీవుడ్‌లో డ్రగ్స్ పార్టీలు కామన్.. వాళ్ల బ్రతుకేంటో నాకు తెలుసు : శ్రీరెడ్డి

Share Icons:
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలు నిలిచే సినీనటి మరో బాంబు పేల్చింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు చాలా కామన్ అంటూ ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగులో టాప్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు కూడా బయటికి వచ్చింది. గతంలో ఓ సారి తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన మరిచిపోకముందే టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.

దీనిపై స్పందించిన శ్రీరెడ్డి… తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది డ్రగ్స్ వినియోగిస్తుంటారని, వారి పేర్లు బయటపెడితే చర్చ మామూలుగా ఉండదని చెప్పింది. స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌసుల్లో రేవ్ పార్టీలు జరుగుతుంటాయని, అక్కడికి వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వాడుకుంటారంటూ ఆరోపించింది. టాలీవుడ్‌ సెలబ్రెటీల్లో ఎవరి బ్రతుకేంటో తనకు తెలుసునని పేర్కొంది.

Also Read:

టాలీవుడ్ పెద్దలపై గతంలో తాను చేసిన ఆరోపణల వల్ల కెరీర్ నాశనం చేసేశారని, ఒక్క సినిమాలో కూడా తనకు ఛాన్స్ ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఆర్టిస్ట్‌గా మెంబర్‌షిప్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపింది. సినిమా ఛాన్సుల కోసం వచ్చే అమ్మాయిలను మభ్యపెట్టి లైంగిక కోరికలు తీర్చుకోవడం సర్వసాధారణంగా మారిందని ఆరోపించింది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు, తెలంగాణ ప్రభుత్వం తనకు సహకరిస్తే… టాలీవుడ్‌లో అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతూ బిగ్‌బాసుల్లా ఫీలవుతున్న వారి బండారం బయటపెడతానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించిన విచారణ చేపట్టడంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని శ్రీరెడ్డి చెప్పింది.

Also Read:

Must Read: