జోఫ్రా ఆర్చర్ బాబా.. డివిలియర్స్ గురించి ఐదేళ్ల కిందటే చెప్పేశాడు

Share Icons:
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. 24 బంతుల్లో 54 పరుగులు అవసరమైన దశలో.. సూపర్ మ్యాన్ ఏబీ డివిలియర్స్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 55 పరుగులు చేసిన ఏబీడీ.. బెంగళూరును గెలిపించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 25 బాల్స్‌లోపు హాఫ్ సెంచరీ చేయడం ఇది 12వసారి. ఇప్పటి వరకూ వార్నర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. రాజస్థాన్‌పై బెంగళూరు గెలిచిన తర్వాత.. ఏబీ డివిలియర్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఏబీ డివిలియర్స్ సంచలన బ్యాటింగ్ తర్వాత.. జోఫ్రా ఆర్చర్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఏబీ సో స్పెషల్’ అంటూ 2015 ఏప్రిల్ 19న ఆర్చర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభంలో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లుంగీ ఎంగీడి ఓవర్లో ఆర్చర్ నాలుగు సిక్సులు బాదాడు. ఆ ఓవర్లో 30 రన్స్ వచ్చాయి. ఆర్చర్ 2015 జనవరి 9నే 6666 అని ట్వీట్ చేశాడు. 2014 అక్టోబర్ 17న ఒకే ఓవర్లో 30 రన్స్ అని ట్వీట్ చేశాడు. దీంతో ఆర్చర్‌ ట్వీట్లు వైరల్ అయ్యాయి.

తాజాగా డివిలియర్స్ విషయంలోనూ జోఫ్రా ఆర్చర్ ఐదేళ్ల క్రితం నాటి ట్వీట్ మళ్లీ వైరల్ అయ్యింది. జోఫ్రా బాబా.. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పవా ప్లీజ్ అంటూ నెటిజన్లు సరదాగా ట్వీట్లు చేస్తున్నారు.