జేసీ బ్రదర్స్ ఇంటి ముందు లారీ ఓనర్ల ధర్నా

Share Icons:
జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ వ్యవహారం మళ్లీ హాట్‌టాపిక్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ నినాదాలు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ – 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని.. నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీ ఓనర్లను అక్కడి నుంచి పంపించేశారు.

మరోవైపు ఓనర్ల ధర్నాపై జేసీ వర్గం స్పందించింది. ధర్నా వ్యవహారం వెనక ఉన్న అధికార పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. ఇదంతా కొందరి డ్రామా అంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు. ఇదంతా జేసీ కుటుంబంపై బుదరజల్లే ప్రయత్నం అంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన లారీలను అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా కొన్ని వాహనాలపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు జేసీ ట్రావెల్స్‌పై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి.