జూలై 17న అద్భుతం ఆవిష్కృతం.. హింట్ ఇచ్చిన ఎన్టీఆర్

Share Icons:
యంగ్ టైగర్ అభిమానులు RRR మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ కోసం వేచి చూస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో తమ హీరో ఎలా ఉండబోతున్నాడో చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్, పరిచయ వీడియో విడుదల కావడంతో ఇక ఎన్టీఆర్ వంతు మిగిలిపోయింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సర్‌ప్రైజ్ ఉంటుందని ఆయన అభిమానులు భావించారు. కానీ, నిరాశే మిగిలింది. లాక్‌డౌన్ కారణంగా స్పెషల్ వీడియోను చేయలేకపోయామని రాజమౌళి టీం చేతులెత్తేసింది.

అయితే, RRR సినిమా నుంచి తమ హీరో ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న వేళ ఓ ప్రచార వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్’కు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్‌ను ఎన్టీఆర్ చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక యాడ్‌ను విడుదల చేసింది. జూలై 17న ఈ కంపెనీకి సంబంధించి విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ఈ యాడ్‌లో ఎన్టీఆర్ వెల్లడించారు.

Also Read:

‘‘మన విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. తెలుసుకోవాలని ఉందా?’’ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది. ఇది సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిన యాడ్ కాబట్టి ఎన్టీఆర్ సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆ అద్భుతం సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిందే. ఇకపోతే.. RRR నుంచి ఎన్టీఆర్ పరిచయ వీడియో వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ వీడియోతో మీ ముందుకు వస్తామంటూ ఇప్పటికే RRR టీం ప్రకటించింది. చూద్దాం ఎప్పుడు వస్తుందో!