జాన్వీకపూర్‌తో పవన్ కళ్యాణ్ రొమాన్స్.. బోణీ కపూర్ పక్కా ప్లాన్!

Share Icons:
శ్రీదేవి కూతురిగా సినీ గడప తొక్కిన జాన్వీకపూర్‌ తన తొలి సినిమా ‘ధఢక్’తో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లకు బాగా దగ్గరైంది. అయితే తల్లి శ్రీదేవి హిందీతో పాటు తెలుగు తెరపై కూడా ఓ వెలుగు వెలగడంతో.. అందరి కళ్లు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై పడ్డాయి. ఈ క్రమంలో సరైన ఆఫర్ రావాలే గానీ తెలుగు తెరపై జాన్వీ కనిపిస్తుందని ఆమె తండ్రి బోణీ కపూర్ చెప్పడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ముందుగా పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాతో జాన్వీ తెలుగు సినిమాల్లో ఆడుగుపెట్టనుందని టాక్ వచ్చినప్పటికీ అది నిజం కాలేదు. ఆ సమయంలో బిజీగా ఉన్నందు వల్లే ఆమె సౌత్ వైపు దృష్టి పెట్టలేదని బోణీ కపూర్ వివరణ కూడా ఇచ్చారు. దీంతో జాన్వీ సౌత్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే సినిమాతో ఆమెను గ్రాండ్‌గా ఎంటర్ చేయాలని పక్కా ప్లాన్ చేశారట బోణీ కపూర్.

ఈ మేరకు జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘’ చిత్రాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోణీ కపూర్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కూతురు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ‘వకీల్ సాబ్’ సినిమాతోనే కావాలని ఫిక్స్ అయ్యారట బోణీ కపూర్. ఈ విషయాన్ని దిల్ రాజు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Also Read:
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శత్వంలో ఈ ‘వకీల్ సాబ్’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. అయితే ఇందులో ఈ ముగ్గురితో పాటు మరో హీరోయిన్‌కి స్కోప్ ఉండటంతో అది జాన్వీ చేయించాలని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందో!.