జడలో పూలు.. థైస్ కనిపించే స్కట్‌.. మేకప్ రూమ్‌లో పాయల్ రాజ్‌పుత్ రచ్చ!

Share Icons:
Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ కిక్కిచ్చిన హీరోయిన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు షూటింగ్ తాలూకు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ హంగామా చేస్తోంది. మొన్ననే తాను కరోనా టెస్ట్ చేయించుకుంటున్న వీడియో షేర్ చేసి ట్రోల్స్ బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మేకప్ రూమ్ విశేషాలు పంచుకుంది.

తన కొత్త సినిమా షూటింగ్ కోసం జడనిండా పూలు పెట్టుకొని రెడీ అవుతోంది పాయల్. ఈ మేరకు గ్లామర్ లుక్ కోసం మేకప్ అవుతున్న వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో మేకప్ రూమ్‌లో ముఖానికి రంగులు అద్దించుకుంటూ థైస్ కనిపించే స్కట్‌తో రచ్చ చేస్తూ కనిపించింది పాయల్. ఎలా కనిపిస్తున్నానని అందర్నీ అడుగుతూ.. సౌత్ ఇండియన్ కల్చర్, తెలుగమ్మాయిలా మారిపోయాను అంటూ నవ్వేసింది ఈ పంజాబీ పాప.

Also Read:
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతుండటంతో హైదరాబాద్ లోనే ఇల్లు కొనుక్కొని సెటిలైపోయింది పాయల్. మరిన్ని విలక్షణ పాత్రలతో అలరిస్తానని చెబుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నరేంద్రతో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీ 5wతో బిజీగా ఉంది. ఇన్ని రోజులు లాక్‌డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్ లోనే ఉన్న పాయల్, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంది.