చేతబడి, క్షుద్ర పూజలు.. కొత్త పెళ్లి కొడుకు రానా ఇలా డిసైడ్ అయ్యారా?

Share Icons:
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినిమాలంటేనే ప్రత్యేకం అన్నట్లుగా దూసుకుపోతున్నారు దగ్గుబాటి వారసుడు రానా. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తున్న ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే రానానే అన్నట్లుగా పేరు తెచ్చుకున్న ఈ కొత్త పెళ్లి కొడుకు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది.

సీనియర్ దర్శకులు మణిరత్నం శిష్యుడు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుందని, జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. గతంలో ‘గృహం’ లాంటి హారర్ సినిమాతో భయపెట్టిన మిలింద్ రావ్.. ఇటీవలే రానాకు తన వద్ద ఉన్న మరో హారర్ కథ వినిపించారట. చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో ఉన్న ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రానా. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తెలుగులో ‘ధీరుడు’ అనే స్ట్రాంగ్ టైటిల్ పరిశీలనలో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే.. రానాకు ఇదే మొదటి హారర్ మూవీ అవుతుంది.

Also Read:
ఇకపోతే రానా తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అరణ్య’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా, తమిళంలో ‘కాండ‌న్’ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలను కరోనా కారణంగా వాయిదా వేశారు. అదేవిధంగా రానా హీరోగా ‘విరాటపర్వం 1992’ పేరుతో మరో సినిమా రాబోతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.