చెన్నై చరిత్రలో తొలిసారి.. ‘ఓడినా.. గెలిచినా నీ వెంటే’.. ఫ్యాన్స్ భావోద్వేగం

Share Icons:
ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా ఆడే చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే.. లీగ్ నుంచి నిష్క్రమించింది. 11 మ్యాచ్‌లు ఆడి మూడింట్లోనే గెలుపొందిన చెన్నై.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఐపీఎల్ చరిత్రలో పది వికెట్ల తేడాతో ఓడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత పది సీజన్లలో అద్భుత విజయాలతో ఫ్యాన్స్ అలరించిన ధోనీ సేన ఇలా పరాజయాలను రుచి చూస్తుందని ఎవరూ ఊహించలేదు.

ధోనీపై విమర్శలు, ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ.. యెల్లో ఆర్మీ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం.. మేం ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులమే అని చాటి చెబుతున్నారు. ధోనీసేనపై తమకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని ‘సీఎస్‌కే ఫరెవర్’ అంటూ చాటుకుంటున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్‌ను ట్రోల్ చేయడానికి ఇతర జట్లకు 13 ఏళ్లు పట్టిందని ఓ అభిమాని వ్యాఖ్యానిస్తే.. ‘మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం మహీ.. ఓటమిలోనూ, గెలుపులోనూ నీతోనే’ అంటూ మరొకరు ధోనీపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.