చాలా భయపడ్డా.. ఒకానొక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి: జెర్సీ నటి

Share Icons:
ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి. సుఖ సంతోషాలతో హాయిగా గడిచిపోతున్న సమయంలోనూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తడం, ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కడం జరుగుతుంటుంది. అయితే కొంతమంది ఆ మాత్రం దానికే ఆత్మహత్యకు పాల్పడి, నిండు జీవితాన్ని కోల్పోతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా తన జీవితంలోని ఇబ్బందులు, బయటపడ్డ విధానం తెలుపుతూ అందరిలో ధైర్యం నూరిపోసింది సినీ నటి .

తెలుగులో ఇటీవలే వచ్చిన ‘జెర్సీ’ చిత్రంలో జర్నలిస్ట్‌ రమ్య పాత్ర పోషించిన సనూష.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. మానసిక కుంగుబాటుకు, మనస్తాపానికి గురయ్యిందట. దీంతో చాలా భయపడ్డానని, ఒకానొక సమయంలో ఆ కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సనూష. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకొని ఆ మానసిక కుంగుబాటు నుంచి బయటకొచ్చానని చెప్పింది.

Also Read:
అయితే తన మానసిక ఆరోగ్యం గురించి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు పలువురు నెటిజన్లు తనపై నెగెటివ్‌ కామెంట్లు చేసినా పెద్దగా పట్టించుకోలేదని ఆమె పేర్కొంది. మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు తన వీడియో చూసి ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని ఆమె తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో అడుగుపెట్టి పలు మలయాళీ సినిమాల్లో నటించిన సనూష.. బంగారం మూవీలో హీరోయిన్‌ సోదరి వింధ్య పాత్రలో, ఆ తర్వాత ‘జీనియస్‌’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. అలాగే నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’లో జర్నలిస్ట్‌‌గా అలరించింది.