‘క‌రోనా’ ఉధృతికి కారణం మన అలవాట్లే: అక్త‌ర్‌

Share Icons:
కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ విస్తరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటి వరకు 21 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి వ్యాధుల బారిన పడడానికి మన ఆహారపు అలవాట్లే కారణమని పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. జంక్ ఫుడ్ తినడం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గి పోవడం ద్వారా ఇలాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో వైరస్ గురించి పలు సూచనలు చేశాడు.

Read Also:
క‌రోనా వైరస్ విస్త‌రిస్తున్న‌ప్ప‌టికీ, ఎలాంటి జాగ్ర‌త్త‌లు లేకుండా చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా క‌న‌పడుతున్నారని అక్త‌ర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తేనే ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చని సూచించాడు. ఒక పని మీద బయటకు వెళ్లినా తాను ఈ విషయాలను గమనించినట్లు పేర్కొన్నాడు. ఒక బైక్ పైన నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, ఆహారాన్ని కూడా పరస్పరం పంచుకుంటున్నారని పేర్కొన్నాడు. వైరస్ కారణంగా రూపొందించిన లాక్ డౌన్ పిక్నిక్ లాంటిది కాదని హితవు పలికాడు.

Read Also:
ఇప్పటికైనా కరోనా వైరస్ తీవ్రత గుర్తించాలని అక్త‌ర్‌ సూచించాడు. చాలామంది వాట్సాప్‌లో వైరస్ కు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని అన్నాడు. కరణ వైరస్ వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని, ఇందుకోసం మన ఊపిరితిత్తులు బలంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు. కరుణ వైరస్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 600 పైగా పాజిటివ్ కేసులు తేలగా.. 11 మంది మరణించినట్లు తెలుస్తోంది.