‘క్లాన్‌ఫిక్ట్‌’ కేసులో క‌పిల్ దేవ్‌కు ఊర‌ట‌

Share Icons:
భార‌త క్రికెట్ రంగాన్ని కుదిపేసిన కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట‌రెస్ట్ (పర‌స్ప‌ర వ్య‌తిరేక ఆస‌క్తులు) కేసులో భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఈ కేసును విచారిస్తున్న బీసీసీఐ ఎథిక్స్ ఆఫీస‌ర్ డీకే జైన్ తాజాగా దీనిపై మాట్లాడారు. క‌పిల్‌పై వెల్లువెత్తిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, ఇవ‌న్నీ నిష్ఫ‌ల‌మైన‌వ‌ని తాజాగా వ్యాఖ్యానించారు. గ‌తేడాది ఎథిక్స్ ఆఫీస‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న జైన్‌.. మ‌రో నెల‌రోజుల్లో ప‌ద‌వి నుంచి దిగిపోనున్నారు.

Read Also:
బీసీసీఐ రాజ్యాంగం ప్ర‌కారం ఒక‌రు ఒక ప‌ద‌వికంటే ఎక్కువ ప‌ద‌వులు చేప‌ట్టినట్ల‌యితే అది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట‌రెస్ట్‌ కింద‌కి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో గ‌తేడాది మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా క‌పిల్ దేవ్‌పై కాన్‌ఫ్లిక్ట్ ఆరోప‌ణ‌లు చేస్తూ జైన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన జైన్‌.. గ‌త డిసెంబ‌ర్‌లో హాజ‌రు కావాలని క‌పిల్‌ను కోరినా.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అతను గైర్హాజ‌ర‌య్యాడు.

Read Also:
తాజాగా ఈ కేసు ప్ర‌గ‌తి గురించి వివ‌రించిన జైన్‌.. క‌పిల్‌పై వ‌చ్చిన ఫిర్యాదు నిల‌బ‌డే అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు కాన్‌ఫ్లిక్ట్ ఆరోప‌ణ‌ల‌తో సీఏసీ స‌భ్యులుగా ఉన్న అన్షుమ‌న్ గైక్వాడ్‌, శాంతా రంగ‌స్వామి తమ ప‌దవుల‌కు క‌పిల్‌తోపాటు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్పీ సింగ్‌, సుల‌క్ష‌ణ నాయ‌క్‌, మ‌ద‌న్‌లాల్‌ల‌ను సీఏసీ స‌భ్యుల‌ుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.