క్రేజీ కాంబోలో చెర్రీ… తమిళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా!

Share Icons:
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడన్నది సస్పెన్స్‌గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఆయన గెస్ట్‌ రోల్ పోషిస్తున్నారు. అంతకుమించి ఆయన సినిమాలపై ఎలాంటి న్యూస్ బయటికి రావడం లేదు. అయితే లాక్‌డౌన్ సమయంలో చెర్రీ చాలామంది దర్శకులు చరణ్‌కు కథలు వినిపించినా ఏదీ ఫైనల్ చేయలేదట.

Also Read:

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా చేయాలని ఉవ్విళ్లూరుతున్న రామ్‌చరణ్ అందుకు తగ్గ కథ కోసం వెతుకున్నాడట. ఈ నేపథ్యంలోనే తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ చెర్రీకి తెగ నచ్చేసిందట. చరణ్ నటించిన ‘ధృవ’ సినిమా మాతృక ‘తనీ ఒరువన్’కు మోహన్ రాజానే దర్శకుడు. తమిళంలో స్టైలిష్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మోహన్ రాజా, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా తెరకెక్కనుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Also Read: