క్రికెట్ పున‌రుద్ధ‌ర‌ణ‌పై గైడ్‌లైన్స్ జారీ చేసిన ఐసీసీ

Share Icons:
క‌రోనా వైరస్ కార‌ణంగా వాయిదా పడిన క్రికెట్ కార్య‌క‌లాపాలను తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా క‌రోనా అనంత‌రం క్రికెట్ కార్య‌క‌లాపాలు మొద‌లైతే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఐసీసీ మెడికల్ కమిటీ ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. అన్ని జ‌ట్లు వీటిని పాటించాలని సూచించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను వివిధ దేశాలు ఎత్తి వేస్తుండ‌టంతో ఐసీసీ ఈ దిశ‌గా మార్గ‌ద‌ర్శ‌కాలను జారీ చేసింది.

Must Read:
ముఖ్యంగా ప్ర‌తి టోర్నీకి ముందు 14 రోజుల‌పాటు క్వారంటైన్‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఐసీసీ తెలిపింది. అలాగే ప్ర‌తి జ‌ట్టు చీఫ్ మెడిక‌ల్ ఆఫీసర్‌తోపాటు బ‌యో సెక్యూర్ ఆఫీస‌ర్‌ను నియ‌మించాల‌ని సూచించింది. ఆయా ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించేలా ఈ అధికారి చూస్తార‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొంది. ప్ర‌తి మ్యాచ్‌కు ముందు ప్రీ ఐసోలేష‌న్ క్యాంపు నిర్వ‌హించాల‌ని, ఆట‌గాళ్ల‌ ఆరోగ్యాన్ని ప‌రీక్షించాల‌ని, కోవిడ్‌-19 టెస్టు నిర్వ‌హించాల‌ని తెలిపింది.

Must Read:
మ‌రోవైపు క్రికెట్ కార్య‌క‌లాపాలను పున‌:ప‌్రారంభించేందుకుగాను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. త్వ‌ర‌లోనే ఆట‌గాళ్ల‌కు ట్రైనింగ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు పేర్కొంది. అలాగే వ‌చ్చే జూలైలో వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ నిర్వ‌హించేందుకు ప‌లు ఏర్పాట్ల‌ను చేస్తోంది. అలాగే పాకిస్థాన్‌తోనూ సిరీస్ నిర్వ‌హ‌ణ‌కు ఈసీబీ పావులు క‌దుపుతోంది.