కోహ్లీ దంప‌తుల‌ను ట్రోల్ చేసిన చాహ‌ల్‌

Share Icons:
క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంతా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌ల‌తోపాటు సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు త‌ప్ప మిగ‌తా సేవ‌లు బంద్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో భార‌త కెప్టెన్ , అత‌ని భార్య సినీ న‌టి అనుష్క శ‌ర్మ తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారు. ఇందులో కోహ్లీకి అనుష్క క‌టింగ్ చేస్తూ క‌న్పించింది. నెటిజ‌న్ల‌ను ఆకట్టుకున్న ఈ ఫొటోపై తాజాగా భార‌త క్రికెట‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ ఫ‌న్నీగా స్పందించాడు.

Read Also:
అనుష్క‌ను ఉద్దేశించి.. కోహ్లీకి క‌టింగ్ చేయాలంటే క‌త్తెర‌ల‌తో ప‌ని కాద‌ని, ట్రిమ్మ‌ర్‌ను ఉప‌యోగించాల‌ని చ‌మ‌త్క‌రించాడు. ఇందుకు రెండు న‌వ్వుతున్న ఎమోజీల‌ను జ‌త చేశాడు. చాహల్ తాజా ట్వీట్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక భార‌త క్రికెట‌ర్ల‌లో చాహ‌ల్ చాలా హ్యూమ‌ర‌స్ అన‌డంలో ఎలాంటి స‌ందేహం లేదు.

Read Also:
చాహ‌ల్ టీవీ పేరుతో త‌ను భార‌త క్రికెట‌ర్ల‌ను ఇంట‌ర్య్వూలు చేస్తూ ప‌లు వీడియోల‌ను పోస్టు చేశాడు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌లైన సంగ‌తి తెలిసిందే. ఇక క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రికెట్ కార్య‌కలాపాలు వాయిదా ప‌డ‌టంతో క్రీడాకారులు అంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. మరోవైపు ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటున్న ఇటీవ‌లే టిక్‌టాక్ వీడియోల‌ను రూపొందించి, సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన వైనం తెలిసిందే.