కోహ్లీ టిక్‌టాక్‌లోకి రా..! అనుష్క హెల్ప్ చేస్తుందిలే: డేవిడ్ వార్నర్

Share Icons:
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ‌ని కవ్వించడమంటే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి మహా సరదా. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఇంటి వద్దే ఫ్యామిలీతో సమయం గడుపుతున్న .. ఒకవైపు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్.. మరోవైపు టిక్‌టాక్ వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. విరాట్ కోహ్లీపై సెటైర్లు పేల్చేస్తున్నాడు. ముఖ్యంగా.. ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ టైటిల్ గెలవలేకపోవడంపై ఇన్‌డైరెక్ట్‌గా కవ్వింపులకి దిగుతుంటాడు. తాజాగా కోహ్లీని టిక్‌టాక్‌లోకి ఆహ్వానించిన డేవిడ్ వార్నర్.. అనుష్క శర్మ నీ అకౌంట్‌ని క్రియేట్ చేస్తుందిలే అని ఎగతాళి చేశాడు.

వాస్తవానికి డేవిడ్ వార్నర్‌ కూడా గత నెల రోజుల నుంచే టిక్‌టాక్‌లో యాక్టీవ్‌గా ఉంటున్నాడు. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంటపురములో’ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో అనంతరం అదే సినిమాలోని ‘రాములో రాములా’ పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక మధ్య మధ్యలో పోకిరి, బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌లతో డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. అన్నీ అతనికి ఆదరణ పెంచాయి.

Read More:

డేవిడ్ వార్నర్ తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలోని ‘బాల’ సాంగ్‌తో టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోని చూసిన విరాట్ కోహ్లీ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్‌ బాక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో.. డేవిడ్ వార్నర్ కూడా స్పందిస్తూ.. ‘‘తర్వాత డ్యుయిట్‌లో నువ్వే సోదరా (విరాట్ కోహ్లీ). టిక్‌‌టాక్ అకౌంట్‌ని నీ భార్య (అనుష్క శర్మ) క్రియేట్ చేయిస్తుందిలే’’ అని నవ్వుతున్న ఎమోజీలను జోడీంచాడు. వార్నర్ టిక్‌టాక్ వీడియోకి అక్షయ్ కుమార్ కూడా స్పందిస్తూ.. మునివేళ్ల నిలబెట్టావని కితాబిచ్చాడు.