కివీస్ నుంచి కోహ్లీసేనకి కవ్వింపులు మొదలు

Share Icons:
న్యూజిలాండ్‌ పర్యటన ముంగిట భారత్‌కి కవ్వింపులు మొదలైపోయాయి. కివీస్ గడ్డపై ఈ నెల 24 నుంచి భారత్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని ఆడబోతోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే భారత్, కివీస్ తమ జట్లని ప్రకటించగా.. ఆ దేశ క్రికెటర్ల నుంచి కవ్వింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియాని మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

Read More:

భారత్‌తో టీ20 సిరీస్‌ గురించి న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ ‘భారత్ జట్టు ప్రస్తుతం వరల్డ్‌ నెం.1 జట్టు. కానీ.. సిరీస్‌ మా సొంతగడ్డపై జరుగుతోంది. కాబట్టి.. న్యూజిలాండ్ జట్టుకి అది కలిసిరానుంది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుకి దాని సొంతగడ్డపైనే గట్టి పోటీనిచ్చాం. ఇప్పుడు అదే జోరుని.. ఇక్కడా కొనసాగించగలం. ఎందుకంటే..? ఇక్కడి పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’ అని వెల్లడించాడు.

Read More:

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

Read More:

న్యూజిలాండ్ టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజిన్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, టామ్ బ్రూసీ, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), హమీశ్ బెనెట్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, బ్లైర్ టింకర్