కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ను వీధుల్లోకి వదిలారు…

Share Icons:

అమరావతి: ప్రతిరోజూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు.

ఏపీలో భారీ ఈఎస్ఐ కుంభకోణం, దాంతోపాటు గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటిపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు వ్యవహారం కలకలం రేపుతున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. సొంత పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చే ప్రయత్నం చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాం, సిట్ దర్యాప్తు తర్వాత టీడీపీలో జరుగుతోన్న పరిణామాల్ని ఆయన వివరించారు.

ఈఎస్ఐ కుంభకోణం విషయంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ధీమాగా ఉన్నారని, దోచుకున్న డబ్బులో సగం చంద్రబాబు కొడుకు లోకేశ్‌కు పంపాడు కాబట్టే.. అంతా చంద్రబాబు చూసుకుంటారన్న భరోసాతో అచ్చెన్న ధీమాగా ఉన్నాడని విజయసాయి రెడ్డి చెప్పారు. ‘‘ఒకవేళ పార్టీగానీ తనకు అండగా నిలవకపోతే.. సీక్రెట్ డైరీలను సిట్ చేతికి అప్పగిస్తానని అచ్చెన్న చంద్రబాబును బెదిరిస్తున్నారట. అందీగాక, లోకేశ్ చెబితేనే లేఖ రాశానని, అందరికీ తెలిసే కుంభకోణం జరిగిందికాబట్టి.. తనకొచ్చిన ఉపద్రవమేదీ లేదని అచ్చెన్న ధీమాగా ఉన్నారట”అని విజయసాయి రాసుకొచ్చారు.

మొన్న ఐటీ దాడులు, ఇవాళ ఈఎస్ఐ స్కాం, సిట్ ఏర్పాటుతో టీడీపీ చీఫ్ అక్రమాలు బయటపడటం ఖాయమని, చంద్రబాబు ఫ్యూచరంతా జైల్లోనే గడుపుతారని విమర్శించారు. ‘రంగస్థలం’సినిమా పాట ట్యూన్ లో.. సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ గుర్తుకొచ్చేలా.. ‘‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న? ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల.. అసలే ఎండాకాలం.. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో? ”అని విజయసాయి విమర్శించారు.

 

Leave a Reply