కాజల్ ప్రీ వెడ్డింగ్ సందడి.. హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ హంగామా

Share Icons:
హీరోయిన్ .. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వివాహానికి రెండు రోజుల ముందు కాజల్ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నిన్న మెహందీ ఫంక్షన్ జరగగా.. నేడు హల్దీ ఫంక్షన్, సంగీత్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాజల్ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

హల్దీ ఫంక్షన్‌లో పసుపు రంగు దుస్తుల్లో కాజల్ మెరిసిపోతున్నారు. అంతేకాకుండా, ఆమె ధరించిన ఆభరణాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సప్రదాయబద్ధంగా పువ్వులతో ఈ ఆభరణాలను డిజైన్ చేశారు. అయితే, హల్దీ ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఎల్లో కలర్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేటట్టు ఎల్లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని కాజల్ హుషారుగా డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియోలో చూడొచ్చు.

మరోవైపు, కాజల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా సందడి చేస్తున్నారు. బేబీ పింక్ లెహెంగాలో మెరిసిపోతున్న నిషా.. ఫొటోగ్రాఫర్లకు స్వీట్స్ బాక్సులు పంచుతూ కనిపించారు. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంటున్నట్టు ఈనెల ప్రారంభంలో కాజల్ అగర్వాల్ ప్రకటించారు. ఆయనతో నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన కాజల్.. ఆ ఫొటోలను మాత్రం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ ప్రీ-వెడ్డింగ్ సంబరాలు ముంబైలోని కాజల్ ఇంట్లోనే జరగనున్నట్టు హైదరాబాద్ టైమ్స్ నిషా అగర్వాల్ తెలిపారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఇంట్లోనే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నట్టు చెప్పారు. అయితే, పెళ్లి వేదిక ఎక్కడన్నది సస్పెన్స్.