కర్నూలు: హత్యకేసు నిందితుడికి కరోనా పాజిటివ్

Share Icons:
కరోనా వైరస్ టెన్షన్ ఏపీని వెంటాడుతోంది.. పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలాఖరులో కాస్త తగ్గినట్లు కనిపించినా.. జూన్‌లో మాత్రం ఈ మహమ్మారి పంజా విసురుతోంది. కాంటాక్ట్ కేసులు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వైరస్ కేసులు పెరిగాయి. రోజుకు కనీసం 100 కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం కూడా టెస్ట్‌ల సంఖ్య పెంచింది.. దీంతో కేసులు బయటపడుతున్నాయి.

ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో హత్య కేసులో తేలింది.. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దేవనకొండ మండలం కుంకనూరులో జరిగిన హత్య కేసులో నిందితుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. వెంటనే పోలీసులు అతడ్నిక్వారంటైన్‌కు పంపారు. అతడికి కరోనా ఎలా సోకిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. అతడికి దగ్గరగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు హత్యకేసు నిందితుడికి కరోనా తేలడం ఆందోళన కలిగిస్తోంది.