కరోనా ఫైట్: వార్నర్ సెల్ఫ్ షేవింగ్..కోహ్లీ, స్మిత్ నామినేట్

Share Icons:
క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వ‌గా.. సుమారు 36 వేల‌మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఇక క‌రోనాను అరిక‌ట్టేందుకు వైద్య సిబ్బంది, ర‌క్ష‌క సిబ్బంది ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. వివిధ ప్ర‌భుత్వ శాఖల‌ను స‌మ‌న్వయం చేసుకుంటూ, త‌మ ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి మ‌రీ పోరాడుతున్నారు. వీరంద‌రికీ మ‌ద్ధ‌తుగా ఆస్ట్రేలియన్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ తాజాగా చేసిన ప‌ని అంద‌రినీ ఆక‌ట్టుకుఉంటోంది.

Read Also:

ఇంత‌కీ వార్న‌ర్ ఏం చేశాడంటే..? ట‌్రిమ్మ‌ర్‌తో త‌లను షేవ్ చేసుకున్నాడు . దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. క‌రోనా వైర‌స్‌పై పోరాడుతున్న‌వారికి మద్ద‌తుగా నిల‌వాల‌ని, ఇందుకోసం త‌న త‌ల‌ను షేవ్ చేసుకోవాల‌ని నామినేట్ చేశార‌ని గుర్తు చేశాడు. అలాగే భార‌త కెప్టెన్ , స‌హ‌చరుడు స్టీవ్ స్మిత్‌ల‌ను ఇదే ప‌ని చేయాల‌ని వార్నర్ నామినేట్ చేశాడు.

Read Also:
మ‌రోవైపు భార‌త దేశంలో కూడా క‌రోనా వైర‌స్ రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేయిమందికిపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. 36 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవాల‌ని భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 21 రోజుల‌పాటు లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైర‌స్ కార‌ణంగా అన్ని ర‌కాల క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌టంతో సాధార‌ణ జ‌నాల‌తోపాటు సెల‌బ్రిటీలు ఆట‌గాళ్లు ఇళ్ల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.