కరోనా కట్టడికి రోహిత్ శర్మ భూరి విరాళం

Share Icons:
భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా ఓపెనర్ భూరి విరాళం ప్రకటించాడు. సహచర క్రికెటర్లు సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళం ప్రకటించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సంయుక్తంగా రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారు. దీంతో.. తాజాగా రోహిత్ శర్మ కూడా రూ. 80 లక్షలు విరాళం ప్రకటించాడు.

Read More:

రోహిత్ శర్మ ప్రకటించిన ఈ రూ. 80 లక్షల్లో.. రూ. 45 లక్షలు పీఎం-కేర్స్ ఫండ్‌కి, రూ. 25 లక్షలు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి కేటాయించాడు. మిగిలిన రూ. 10 లక్షల్లో సగాన్ని జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా పేదల భోజనానికి కేటాయించిన ఓపెనర్.. మిగిలిన మొత్తాన్ని వీధి కుక్కుల సంరక్షణ కోసం విరాళమిచ్చాడు.

Read More:

భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నానికి 1400కి చేరుకోగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 248 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో.. ఎక్కువ మంది క్రికెటర్లు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ పండ్‌కి విరాళాన్ని కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా క్రికెటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ఇవ్వగా.. స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు డొనేట్ చేశారు.