కరోనా ఎఫెక్ట్.. అలాంటి సీన్లలో నటించనంటోన్న లావణ్య!

Share Icons:
కరోనా మహమ్మారి మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేసింది. చక్కగా ఎలా బడితే అలా తిరిగేవాళ్లకు కాళ్లు, చేతులు కట్టి ఇళ్లలో పడేసింది. సినిమాలు, షికార్లు లాంటి సరదాలను దూరం చేసింది. పేదలకు పట్టెడు అన్నం లేకుండా చేసింది. ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. అంతేనా జనాల్లో భయాన్ని నింపేసింది. ఆ భయంతోనే ఇకపై హీరోలతో బాగా సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించనంటున్నారట హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

ప్రస్తుతం సినిమాల్లో లిప్‌లాకులు, శృతిమించిన శృంగారభరిత సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, లావణ్య ఇప్పటి వరకు అంత ఘాడమైన సన్నివేశాల్లో నటించలేదనుకోండి. ఒకవేళ ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తాను నో చెబుతానని లావణ్య స్పష్టం చేశారట. ఎందుకంటే, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈరోజుల్లో అలాంటి సీన్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని లావణ్య భావిస్తున్నారట. తన ఆరోగ్యంతో పాటు తనతో పనిచేసేవారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట.

Also Read:

వాస్తవానికి భారత ప్రభుత్వం కూడా సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇకపై ఇంటిమేట్ సీన్స్ సినిమాల్లో ఉండవని టాక్. ఆ నిర్ణయం రావడానికి ముందే లావణ్య తన నిర్ణయాన్ని వెల్లడించారట. కాగా, ప్రస్తుతం లావణ్య చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ చిత్రం ఉన్నాయి. తెలుగులో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో లావణ్య నటిస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యి ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు మొదలవుతాయి.