కరోనాతో కన్నుమూసిన నర్సు.. చివరిగా భర్తతో ఏం చెప్పిందంటే..

Share Icons:
యూరోప్‌లో ప్రధాన దేశమైన బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా మృతుల 4వేలు దాటిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 41,903కి చేరింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. తాజాగా నస్రీన్ అనే నర్సు(38) కరోనా బారిన పడి చనిపోయింది. చనిపోయే ముందు భర్త ఆమె పక్కనే ఉన్నారు. చివరిగా ఆమె భర్తతో చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Also Read:

బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌కు చెందిన అరీమా నస్రీన్ వాల్‌సన్ మ్యానర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆమె ఎప్పటి నుంచో అక్కడే హౌస్‌కీపర్, హెల్త్ కీపర్‌గా ఏళ్లపాటు పనిచేస్తూ తపనతో నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. గతేడాదే నర్సుగా అదే ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల బ్రిటన్‌లో విలయ తాండవం చేస్తుండటంతో నస్రీన్ రోగుల సేవలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె కూడా కరోనా బారిన పడింది. తాను రోగులకు సేవ చేసిన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇటీవల ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పేశారు.

Also Read:

దీంతో నస్రీన్‌ను చూసేందుకు గురువారం భర్త ఆస్పత్రికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో ఆమె మాట్లాడలేకపోయినా సైగలతో పిల్లలు జాగ్రత్త అంటూ భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆమె దగ్గరకు వెళ్లి ‘బెంగ పెట్టుకోకు.. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటా’ అని చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్లు వద్దని చెబుతున్నా భార్యను హత్తుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నస్రీన్ ప్రాణాలు కోల్పోయింది. నస్రీన్‌కు ఆస్పత్రితో సుదీర్ఘ సంబంధం ఉండటంతో అక్కడి సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: