ఓ ట్రాన్స్‌జెండర్‌తో స్నేహం చేస్తున్నా.. దేవి పూజపై రియాక్ట్ అవుతూ ఉపాసన ఓపెన్ కామెంట్

Share Icons:
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వతాహాగా సామాజిక స్పృహతో పలు పోస్టులు పెట్టే ఆమె.. తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. సమాజానికి ఉపయోగకరమైన ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా చెప్పేయడం ఉపాసన నైజం. ఈ క్రమంలోనే తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలుపుతూ దేవి పూజ విషయమై కళ్ళు తెరిపించే కామెంట్స్ చేసింది.

సెలబ్రిటీ ఫ్యామిలీ, పైగా మెగా ఇంటి కోడలైనప్పటికీ ఎంతో సాధారణంగా ఉండే ఉపాసన.. బిజినెస్‌ విమెన్ ‌గానే కాకుండా సామాజికవేత్తగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎప్పటికప్పుడు మహిళా సాధికారతపై పోరాడే ఈ మెగా కోడలు.. సమాజంలో మహిళా విలువలు, మహిళలకు ఇస్తున్న గౌరవం తదితర అంశాలపై స్పందిస్తూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేసింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు జనాలను ఆలోచింపజేస్తున్నాయి.

Also Read:
ఓ ఛానెల్‌కి ఉపాసన ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో విడుదల కాగా.. అందులో తన బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని ఆమె బయట పెట్టడం ఆమె లోని పారదర్శకతకు అద్దం పడుతోంది. ఇకపోతే అదే వీడియోలో ఉపాసన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని అన్నారు. అంతేకాదు పూజ గది నుంచి దేవి ఫొటోలను తీసేయాలని ఆమె సూచించారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఉపాసన చెప్పిన ఈ విషయాలను అంతా స్వాగతిస్తుండటం విశేషం.