ఓటీటీలో విడుదల కానున్న రవితేజ సినిమా ?

Share Icons:
కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడింది. సినిమా రంగంపై కూడా ఈ ప్రభావం బాగానే చూపించింది. అనేకమంది ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. మరికొందరు వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇంకొందరు ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. షూటింగులు నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు చవిచూశారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో నెమ్మది నెమ్మదిగా షూటింగులు ప్రారంభించారు. గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పుంజుకుంటున్నాయి.

సినిమా షూటింగులు అవుతున్నా.. ఇంకా ధియేటర్లు మాత్రం ఓపెన్ కాలేదు. దీంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్ధు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలైన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో సినిమా కూడా ఓటీలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రవితేజ క్రాక్ కూడా ఓటీటీలో విడుదల కానుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. డాన్ శీను బలుపు చిత్రాల తరవాత , రవితేజ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.

Read More:

దీంతో క్రాక్ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజకు జంటగా శృతిహాసన్‌ నటిస్తుంది. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే రోజురోజుకు కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతున్నాయి. దీంతో ఇప్పట్లో ఏపీ తెలంగాణలో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో క్రాక్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై సినిమా నిర్మాతలు చర్చిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.