ఓటీటీలోకి అనుష్క ‘నిశ్శబ్దం’.. రేపు క్లారిటీ ఇవ్వనున్న నిర్మాత

Share Icons:
అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘’. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధం కాగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. సుమారు ఆరు నెలలుగా థియేటర్లు తెరుచుకోకపోవడంతో బాక్సులన్నీ ల్యాబ్‌లోనే ఉండిపోయాయి.

Also Read:

ఇప్పట్లో థియేటర్ల తెరుచుకునే అవకాశాలు కనిపించకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. దీంతో ‘నిశ్చబ్దం’ నిర్మాతలు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. దీని హక్కులు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. నాని, సుధీర్‌బాబు నటించిన ‘వి’ సినిమా ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: