ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై కీల‌క నిర్ణ‌యం.. వ‌చ్చేవారం ప్ర‌క‌ట‌న‌!

Share Icons:
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఐసీసీ వర్గాలు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఈ టోర్నీని వాయిదా వేయ‌డమే మేల‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ‌చ్చేవారం అనుబంధ బోర్డుల‌తో ఐసీసీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, దీనిపై ప్ర‌క‌ట‌న చే య‌నుంద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఈ స‌మావేశంలో మ‌రిన్ని నిర్ణ‌యాలను ఐసీసీ తీసుకోనుంది. ఈ నెలాఖ‌రుతో ఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖాళీ అవుతుండ‌గా, ఈ ప‌ద‌వికి భర్తీ‌పై చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

Must Read:
మ‌రోవైపు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదాపై ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సుముఖంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఖాళీ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వ‌హించ‌డం ద్వారా బారీ ఎత్తున టికెట్ రెవెన్యూ న‌ష్ట‌పోతామ‌ని సీఏ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో టోర్నీని ఎప్పుడు నిర్వహించాలో అనేదానిపై ఐసీసీ మూడు ర‌కాల ప్ర‌త్య‌మ్యాయాల‌తో ముందుకొస్తోంది.

Must Read:
తొలుత ఈ టోర్నీని ఫిబ్ర‌వ‌రి కాలంలో నిర్ణ‌యించాల‌ని ఐసీసీ భావిస్తోంది. దీనిపై సీఏ కూడా సుముఖంగానే ఉంది. అయితే అదే స‌మ‌యంలో భార‌త్‌-ఇంగ్లాడ్ సిరీస్ ఉండ‌టంతో ప్ర‌సార‌దారుల నుంచి అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఇక రెండో ప్రత్యామ్నాయంగా 2021 టోర్నీని ఆసీస్‌లో, 2022 టోర్నీని భార‌త్‌లో నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. అయితే దీనిపై భార‌త్ బోర్డు రెడ్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఇక చివ‌ర‌గా 2022లో టోర్నీని నిర్వ‌హించ‌డంపై దృష్టి సారించింది. ఆ ఏడాది ఒక్క ఐసీసీ టోర్నీ కూడా లేక‌పోవ‌డంతో ఇదే మంచి స‌మ‌య‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రిగే అక్టోబ‌ర్ స‌మ‌యంలో భార‌త్‌లో ఐపీఎల్ నిర్వ‌హించే అవ‌కాశాలున్నాయి.