ఐసీసీ ఆ నిర్ణ‌యంతో బౌల‌ర్ల‌కు చిక్కులు త‌ప్ప‌వు: భార‌త మాజీ పేస‌ర్

Share Icons:
క‌రోనా ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఇటీవ‌లే కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో బంతిని మెరిపించేందుకుగాను స‌లైవా (ఉమ్మి), చెమ‌ట‌ను వాడకూడ‌ద‌ని ఐసీసీ ఆదేశించింది. తాజా నిర్ణ‌యంపై భార‌త మాజీ పేస‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. బ్యాట్స్‌మెన్‌కు మ‌రింత అనుకూలంగా ఆట మారుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌ల్లో బౌల‌ర్ల‌కు చిక్కు త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించాడు.

Must Read:
రెడ్ బాల్ క్రికెట్లో బంతిని మెరుపు తెప్పించేందుకుగాను బౌల‌ర్లు స‌లైవాను వాడుతార‌ని పఠాన్ గుర్తు చేశాడు. తాజా పరిస్థితుల్లో స‌లైవాపై నిషేధాన్ని రెండేళ్ల‌పాటు కొన‌సాగించే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేశాడు. బౌల‌ర్లు రాణించేందుకు పేస్‌తోపాటు స్వింగ్ అవ‌స‌రమేన‌ని, బంతి మెరుపును తిరిగి ర‌ప్పిస్తే స్వింగ్ ల‌భించే అవ‌కాశ‌ముంద‌ని వ్యాఖ్యానించాడు.

Must Read:
మ‌రోవైపు వైట్ బాల్ క్రికెట్లో స‌లైవాతో పెద్ద‌గా న‌ష్ట‌మేమీ ఉండ‌బోద‌ని ప‌ఠాన్ తెలిపాడు. ఇక సలైవాను వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల రివ‌ర్స్ స్వింగ్ సాధించే అవకాశాలు ఉండ‌బోవ‌ని తెలిపాడు. ఇక క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గిన అనంత‌రం క్రికెట్ కార్య‌క‌లాపాలు తిరిగి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో మ్యాచ్‌ల‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.