ఐపీఎల్‌పై కేంద్ర క్రీడామంత్రి రిజిజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Share Icons:
వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర క్రీడా మంత్రి కిర‌ణ్ రిజిజు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. స‌మీప భ‌విష్యత్తులో ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ చోటే చేసుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌స్తుతం తాము కరోనా వైర‌స్‌పై పోరాడుతున్నామ‌ని, అలాగే క్రీడా కార్య‌క‌లాపాల‌ను సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. నిజానికి మార్చి 29న ప్రారంభంకావాల్సిన 13 ఎడిష‌న్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Must Read:
అయితే ఈ ఏడాది చివ‌రివ‌ర‌క‌ల్లా క‌చ్చితంగా క్రీడా టోర్నీలు జ‌రుగుతాయ‌ని రిజిజు అంచ‌నా వేశారు. అయితే ఇప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు లేకుండా పోటీలు జ‌ర‌గ‌డం సాధార‌ణం కానుంద‌ని తెలిపారు. మ‌రోవైపు ఇప్ప‌టికే క్రీడా కార్య‌క‌లాపాల పున‌రుద్ధ‌ర‌ణ కోసం సాయ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెలువ‌రించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

Must Read:
ఇక ఐపీఎల్ ప్రారంభం గురించి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని రిజిజు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఐపీఎల్‌ను వ‌ర్ష‌కాలం ముగిశాక విదేశీ ప్లేయ‌ర్ల‌తో నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు బీసీసీఐ సీఈఓ రాహుల్ జొహ్రి తెలిపారు. నిజానికి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో దీన్ని నిర్వ‌హించ‌డంపై సందిగ్ధత ఏర్పడింది. ఈక్ర‌మంలో ఈ టోర్నీ విండోలో ఐపీఎల్‌ను నిర్వ‌హించేందుకు బోర్డు ఆలోచిస్తోంది.