ఏపీ భక్తులకు గుడ్ న్యూస్, ఆలయాలన్నీ ఓపెన్.. మార్గదర్శకాలివే..

Share Icons:
లాక్‌ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేవాలయాలు తెరిచేందుకు అనుమతులిచ్చిందని దేవాదాయశాఖ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్‌లో దేవాలయాలు ఉంటే అక్కడికి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. క్యూలైన్‌లో భక్తులందరూ కచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాల్సిందేనని తెలిపారు.

దేవాలయాల్లోకి మాస్క్ ఉన్నవారినే అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దేవాలయాల ఎంట్రన్స్‌లోనే వచ్చే భక్తులకు థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలయాల ప్రాంగణాల్లో ఉమ్మి వేయడం నిషిద్ధమన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల ఉద్యోగులు, స్థానికులతో ట్రైల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భక్తులందరినీ నిబంధనల ప్రకారం దర్శనానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు.

తలనీలాల సమర్పణ, భక్తుల అన్నదానానికి సంబంధించి దేవాలయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సంబంధిత ఆలయ అధికారులే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఏ ఆలయాల్లో శఠగోపం, తీర్ధ ప్రసాదాలు ఉండబోవన్నారు. భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు.